2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

యూనికోడ్

ఈ-తెలుగు నుండి

(Unicode నుండి మళ్ళించబడింది)

విషయ సూచిక

యూనికోడ్ అంటే?

ప్రతీ అక్షరానికీ ఓ ప్రత్యేక సంఖ్యని యూనీకోడ్ ఇస్తుంది, ప్లాట్‌ఫామ్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా, భాష ఏదైనా.

యూనికోడ్ ఎందుకు?

  • యూనీకోడు ఎందుకు? వ్యాసం
  • ప్రతి ఒక్క వెబ్ సైటుకీ నాణ్యత కలిగిన సమాచారం అందించడం ఎంత ముఖ్యమో..పాఠకుల అభిప్రాయాలు సేకరించడం కూడా అంతే ముఖ్యం. ఒక వేళ పాఠకుడు తన అభిప్రాయాన్ని తెలుగులోనే విన్నవించికోదలుచుకొంటే...అది యూనీకోడులోనే సాధ్యం.
  • ఇతర సంకేతలిపులు (encodings) తెలుగుని కేవలం చూపించడానికి మాత్రమే రూపకల్పన చేయబడ్డాయి. యూనికోడ్ మాత్రం అన్ని రకాల సమాచార processing అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.
  • రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలలో సమాచారాన్ని అందిచవలని వచ్చినప్పుడు, యూనికోడ్ ద్వారా అయితే చాలా సులభం. ఎందుకంటే ప్రపంచ భాషలన్నింటికీ యూనికోడ్లో తోడ్పాటు ఉంది.
  • యూనికోడ్లో ఉన్న సమాచారాన్ని శోధించడం చాలా తేలిక. అంతేకాదు, దాదాపు అన్ని నిర్వాహక వ్యవస్థలు (OS) మరియు అన్ని ప్రధాన శోధన యంత్రాలు (search engines) యూనికోడ్ తోడ్పాటుని కలిగి ఉన్నాయి. ప్రైవేటు సంకేతలిపులలో ఉన్న సమాచారాన్ని వెతికే వీలుని ఒకటో రెండో శోధన యంత్రాలు తప్ప మిగతావి కల్పించడంలేదు.

అపోహలు

యూనికోడ్ ఫాంటు అందంగా ఉండదు

యూనికోడ్ అన్నది ఫాంటు కాదు. యూనీకోడ్ అన్నది ఒక కంప్యూటర్ పరిభాష మాత్రమే. యూనీకోడ్ చూపించడానికి ఫాంట్లు వేరే. అవి మీ ఆపరేటింగ్ సిస్టంతో పాటు వస్తాయి లేదా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదా: విండోస్ లో గౌతమి అనే యూనీకోడ్ ఫాంటుంది తెలుగు కోసం. అలాగే పోతన, వేమన వంటీ ఇతర ఫాంట్లూ లభ్యం.

యూనికోడ్ అమలుచేయడం కష్టం

అన్ని కంప్యూటర్లలోనూ యూనికోడ్ కనబడదు

అన్ని ప్రముఖమైన ఆపరేటింగ్ సిస్టంలలోనూ యూనీకోడ్ కి సపోర్టు ఉంది. విండోస్, లినక్స్, మాక్ ఏవయినా సరే యూనీకోడ్ ని సపోర్టు చేస్తాయి.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు