2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

UWSM1

ఈ-తెలుగు నుండి

సమావేశానికి హాజరైనవారు:

విషయ సూచిక

సమావేశపు వివరాలు

సమావేశము మైక్రోసాఫ్ట్ క్యాంపసు నందలి బరిస్టాయందు జరిగినది. ఇది తొలి సమావేశము అవడం వల్ల ఎవరినీ పిలవలేదు. కేవలము ఈ ముగ్గురు మాత్రమే మొదలు పెట్టినారు.

మొదట సుధాకర్ సదాశివుని గారు మంచి కాఫీ తీసుకొని వచ్చినారు. తరువాత చాలా చాలా మాట్లాడుకున్నాము (అన్నట్టు సుధాకర్ ఐపాడ్ బాగుందండోయ్!) రైతుల కష్టాల గురించి, సుఖాల గురించి, ప్రపంచ బ్యాంకు గురించి, చావా కథ గురించి మాట్లాడుకున్నాము. సుధాకర్ గారు ఒక మంచి కథ కూడా చెప్పినారండోయ్!

సుధాకర్ చెప్పిన కథ

అది ఓ యాబై సంవత్సరాల తరువాత, ఓ రైతు తన టమాటోలు అమ్ముకుందామని బండిలో వేసుకోని బయలుదేరుతాడు. వీధి చివరకు వచ్చి ప్రపంచబ్యాంకు డేరా దగ్గర ఆగి వాట్, గీట్, మోట్, ఫట్‌ఫట్ టాక్సులు అన్నీ కట్టి ప్రతి టమాటో పై డి్జిటల్ సిగ్నేచరు వెయ్యించుకుని వెళ్లి బజారులో అమ్ముకుంటాడు :)

తరువాత మీడియా గురించి [[1]] గురించి మన వై యస్సు గారి లేటెస్టు ఇంటర్వ్యూ పాట్ల గురించి, ఈనాడు మంచి చెడు గురించి బాగా బాగా మాట్లాడినాము.

టీవీ నైన్ ను ఏకి పారేసినాము. చావా మీడియా కల గురించి, జర్నలిస్టుల నీతి నిజాయితీల గురించి మాట్లాడుకున్నాము. టీవీనైన్ లో కొత్త యాంకర్ల గురించి మాట్లాడుకున్నాము.

సరే సరే అసలు పాయింటుకు వస్తున్నాను.

తరువాత మేము యూనీకోడు వర్క్‌షాపు గురించి మాట్లాడుకున్నాము.

నిర్ణయాలు

విషయము:

  • తెలుగు బ్లాగింగు గురించి చెప్పాలి
  • కొన్ని తెలుగు బ్లాగులను చూపించాలి
  • కూడలి, తేనెగూడు, తెలుగు బ్లాగర్ల ప్రపంచం చూపించాలి
  • తెలుగు బ్లాగు,ఈ-తెలుగు, మొదలైన గ్రూపులలో చేరమని చెప్పాలి
  • తెలుగు వికీ గురించి చెప్పాలి
  • ఏవైనా వ్యాసాలను తెలుగు వికీ నుండి చూపించాలి
  • కంప్యూటరునకు తెలుగు నేర్పడం ఎలా అని చెప్పాలి
gif
యూనికోడ్ అనగానేమీ? ఎందుకు? ఎలా?
dynamic fonts వాడే సైట్లు...బాధలు
OS - 98, 2000, XP, Vista, Linux
  • యూనీకోడ్ టూల్స్ (లేఖిని, బరహ, మైక్రోసాఫ్టు ఫొనెటిక్ ఇన్పుట్ టూల్...లాంటివి)
  • తెలుగులో ఈ-మెయిల్ రాయటం ఎలా? నోట్ ప్యాడ్లో కూడా రాయటం ఎలా?
  • gimp
  • ఇప్పుడున్న మంచి మంచి తెలుగు యూనికోడ్ వెబ్ సైట్లు
  • ఈ-తెలుగు సంఘ నమోదు వివరాలు
  • ఈ-తెలుగు ప్రచురించిన కరదీపిక వివరాలు
  • కరపత్ర పంపిణీ
  • భవిష్యత్ ప్రణాలిక

చెయ్యవలసిన పనులు

"http://wiki.etelugu.org/UWSM1" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు