2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

E-తెలుగు త‌.అ.‌ప్ర

ఈ-తెలుగు నుండి

వివిధ సందర్భాలలో e-తెలుగు సభ్యులకు ఎదురైన ప్రశ్నలు; అంటే పత్రిక, రేడియో, టీవీలలో e-తెలుగు మీద ఏదన్నా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడో, e-తెలుగు సభ్యులను ముఖాముఖీ చర్చిస్తున్నప్పుడో ఎదురయే ప్రశ్నలను వాటి జవాబులను ఇక్కడ పొందుపరుస్తున్నాము. e-తెలుగు సభ్యులు మరియు ఔత్సాహికులు ఈ పేజీని తీర్చిదిద్దవలసినదిగా మనవి.

విషయ సూచిక

e-తెలుగు అంటే ఏమిటి?

e-తెలుగు అన్నది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగుని వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను), అంతర్జాలాన్ని వాడుకోగలగాలి. అన్నది e-తెలుగు స్వప్నం.

e-తెలుగు ఎలా ఏర్పడింది

అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2005 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ఇవన్నీ చెయ్యడానికి ముందు అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు.

ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించారు. ఆ ఆలోచన ఫలితం గానే e-తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఆలోచన 2007 లోనే మొగ్గ తొడుగుకున్నా, దానిని అధికారికంగా 2008 ఏప్రిల్‌లో నమోదుచేయించి అప్పటి నుండే e-తెలుగు పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.

e-తెలుగు ఏం చేస్తుంది?

  • కంప్యూటరులో తెలుగును స్థాపించుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందుకవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను కూడా తయారుచేసి ఉచితంగా అందిస్తుంది.
  • తెలుగులో టైపు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. లిప్యంతరీకరణకు అవసరమైఅన ఉపకరణాల గురించి ప్రచారం చేస్తుంది.
  • ఇప్పటికే వివిధ కీబోర్డు లేఔట్లను వాడి తెలుగులో టైపు చేస్తున్నవారికి అవే లేఔట్లను వాడి యూనికోడులో కూడా టైపు చేసేందుకు అవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను తయారుచేసి, ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఈ విషయమై ప్రచారమూ చేస్తోంది.
  • అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది.
  • వివిధ సాఫ్టువేరు ఉపకరణాల స్థానికీకరణ గురించి తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి వాటికి సంబంధించిన విషయాలలో సాంకేతిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

e-తెలుగు సాధించిన విజయాలు; అధిగమించిన మైలురాళ్లు

e-తెలుగు ఏం చెయ్యదు?

అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు చెయ్యడం, సాంకేతిక సహాయం అందించడం e-తెలుగు లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భగంగా అవసరమైన కార్యక్రమాలను చేపడుతుంది. కానీ కింది జాబితాలోని పనులు e-తెలుగు కార్యక్రమాల్లో భాగం కాదు.

  1. తెలుగు భాష మంచి చెడుల గురించి చర్చించడం
  2. తెలుగు భాషలోని వివిధ మాండలికాలు, యాసలు మొదలైనవాటి గురించి చర్చించడం
  3. గ్రాంథికం, వ్యావహారికం వంటి వివిధ రచనా శైలుల గురించి చర్చించడం
  4. తెలుగు సాహిత్యంలోని వివిధ వాదాలు, ఇజాలు, ఉద్యమాలు మొదలైనవాటి గురించి చర్చించడం
  5. సామాజికంగాను, విద్యారంగంలోను, ప్రసార మాధ్యమాల్లోను, పరిపాలనలోను, వ్యాపార వ్యవహారాల్లోను, తెలుగును అమలు చేసే విషయంలో కృషి చెయ్యడం.

బ్లాగుల వలన అసలు ఉపయోగమేమిటి?

బ్లాగుల వలన స్త్రీ/గృహిణులకు ఉపయోగమేమిటి?

బ్లాగుల వలన విద్యార్థులకు ఉపయోగమేమిటి?

(తెలుగు) వికీపీడియా అంటే ఏమిటి; దాని ఉపయోగం ఏమిటి?

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు. ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా. ప్రపంచంలో ఉన్న 200 పైచిలుకు భాషలలో వికీపీడియా లభ్యమవుతుంది. తెలుగు వికీ భారతీయ భాషల అన్నింటికన్నా ముందంజలో ఉంది. ఇందులో ప్రస్తుతానికి 42 వేల పైనే వ్యాసాలు ఉన్నాయి. 8 వేలకు పైనే సభ్యులు ఉన్నారు.

e-తెలుగు కార్యాలయం ఎక్కడ ఉంది?

e-తెలుగు ప్రధాన కార్యక్షేత్రం అంతర్జాలమే! అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చెయ్యడమే ప్రధాన ఆశయంగా పనిచేస్తున్నది కాబట్టి, e-తెలుగు కార్యకలాపాలన్నీ అంతర్జాలంలోనే కేంద్రీకృతమయ్యాయి. అంతర్జాలంలో e-తెలుగు కేంద్ర కార్యాలయం etelugu.org, అనగా ఈ వెబ్‌సైటే. అంతర్జాలంలోనూ బయటా జరిపే కార్యక్రమాలన్నిటినీ ఈ వెబ్‌సైటు నుండే సంఘం సమన్వయపరుస్తూ ఉంటుంది.

e-తెలుగులో సభ్యత్వం ఎలా తీసుకోవాలి?

పేజీకి సంభందించిన లింకులు