2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
Eతెలుగు సమావేశం, మే 2007
ఈ-తెలుగు నుండి
షడ్రుచిత భరిత మే '07 మాసం సమావేశం
ఈ నెల సమావేశం ముందనుకున్నట్లుగా ఈ నెల 5 న జరిగింది. A.P.Govt.Oriental Manuscripts Library & Research Institute, Osmania University Campus ను సభ్యులు visit చెయ్యటం జరిగింది. తేడా అల్లా ఈ సారి regular meeting లా కాకుండా ప్రయాణ సమయంలోను, లంచ్ విరామ సమయం లో లభించిన సమయాన్ని చర్చలకు వాడటం జరిగింది. ఎక్కువ సమయం తిరుమలరావు గారి కార్యాలయంలో గడపటం వలన సభ్యుల ఆంతరంగిక చర్చా కార్యక్రమం కుదించబడింది. సంజీవరెడ్డి నగర్ నుంచి తార్నాకా వెళ్ళేదాక సమయాన్ని సభ్యులు చర్చలకు, పిచ్చాపాటికి వినియోగించారు. సాహిత్యంలో చలం మైదానం పై సాగుతున్న చర్చ మన సభ్యులను ఆకట్టుకుంది. చలం నాస్తిక భావాలను వెలిబుచ్చిన విషయం తెలియదని ఒక సభ్యుడు అన్నారు. చలం నాస్తికత నుంచి ఈశ్వరవాదం లోకి మరలటం అభిమానులను fool చెయ్యటమేనని త్రివిక్రం, బానిసత్వం నుంచి స్త్రీ స్వేచ్చకు, లేచిపోవటం పరిష్కారం కాదనీ, స్త్రీకి చదువు, తన కాళ్ళపై నిలబడగలిగే శక్తి సంతరించుకొన్నప్పుడు ఈ సమస్య కు పరిష్కారం లభించగలదని cbrao అభిప్రాయ పడ్డారు.
ఈ నెల సమావేశానికి కొత్తగా ఇద్దరు సభ్యులు వచ్చారు. వారు 1) Dr.టి.యల్.యస్.భాస్కర్ 2) జ్యోతి వలబోజు.
Dr.భాస్కర్, బైర్రాజు ఫౌండేషన్ లో సేవాకార్యక్రమాల అభివృద్ధి పనుల అధికారిగా పని చేస్తున్నారు. బైర్రాజు ఫౌండేషన్ గురించిన సమాచారం కోసం చూడండి [1]
అమెరికా వంగూరి ఫౌండేషన్ వారు 1-1-'07 న హైదరాబాదు లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సదస్సులో "మారిషస్ లో తెలుగు భాష, ప్రజలు" అనే అంశం పై డా.భాస్కర్ ప్రసంగించారు. [2]
డా.భాస్కర్ ఈ మధ్యనే తెలుగులో బ్లాగు మొదలు పెట్టారు.చూడండి.[3]
డా.భాస్కర్ అంటున్నారు "సభ్యులకు, తెలుగు డయాస్పోరా లో ఉన్న మన తెలుగు వారి culture, భాష మీద ఎమైనా "discussion" లాంటిది ఉంటే నా "experiences" మీతో పంచుకొంటాను.".
Diaspora: A dispersion of an originally homogeneous entity, such as a language or culture, any group that has been dispersed outside its traditional homeland.
డా.భాస్కర్ తెలుగు వలస కారులపై పరిశోధించి ఒక research paper వెలువరించారు.An Introduction on Emigration of Telugus: A Working Paper- by TLS Bhaskar. ఈ పరిశోధనా పత్రము చదవాలనే ఆసక్తి కలవారు డా.భాస్కర్ కు జాబు రాయవచ్చు.
Diaspora Foundation ® is a registered body that attempts to document and promote research in themes directly relevant in understanding of Indian Diaspora. Research Papers titled under Indian Diaspora Series, one of the initiatives of Diaspora Foundation ®, are published with the aim of providing a forum for analysis and debate on issues concerning Indian Diaspora. The Foundation publishes work which combines theoretical and analytical originality in the analysis.
Diaspora Foundation ® is currently involved in a larger project of gathering and documenting details on Diaspora Philanthropy. Overseas Telugus have been making immense contributions towards addressing several socio-cultural, political and economic issues concerning their lands of origin, there by becoming active part of the ‘giving’ back. I will be grateful if you can send me details of any such ‘giving’ and assist us in our endeavor towards writing a comprehensive report on the giving patterns of overseas Telugus. –Dr. Bhaskar
ఈ నెల, సమావేశానికి, కొత్తగా వచ్చిన మెంబర్ జ్యోతి. మన బ్లాగరులంతా ఆప్యాయంగా పిలిచే జ్యొతక్కే. గృహిణి, జ్యొతి వలబోజు కి వంటలన్నా, సంగీతమన్నా చాలా ఇష్టం. హైదరాబాదు మస్తీ గ్రూప్ లో చాలా active member.తెలుగు బ్లాగ్ గుంపులో చర్చలలో ఉత్సాహంగా పాల్గొంటారు. www.ammas.com లో కూడా మెంబరే. ఇక్కడ మీరు వేసే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలిస్తారు. పొద్దు web magazine కు తరచూ రాస్తారు. 5 బ్లాగులలో టపాలు రాస్తున్నారు. చూడండి.
ఎన్ని టపాలు రాశారో! మన సభ్యులెవరూ చెప్పలేనన్ని రాశారు. తక్కువ కాలంలో ఎక్కువ బ్లాగులు, టపాలు తెలుగు లో రాసిన record జ్యోతిదే. ఇందుకు అభినందించాలి జ్యోతక్కను. జ్యొతి రాయని వంటకము కలదే అది ఒక్కటి తప్ప, అని అనుకునే వారికి సమాధానం గా తాజాగా నరమాంసం తో రుచిగల కూర ఎలా వండవచ్చో రాసారు. చూడండి. [9]
Dr. Tirumala Rao [10]
కబుర్లలో ఉండగానే చదువరి వాహనము మా ఆరుగురినీ డా.తిరుమలరావు గారి కార్యాలయానికి చేర్చింది. డా.తి.రావు గారు మమ్ములను ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి వారి కార్యాలయ ఉద్యోగులను పరిచయం చేసినారు. తూర్పు దేశాల తాళ, లిఖిత పుస్తకాల అపురూపమైన పుస్తక భాండాగారమిది. 2000 వేల సంవత్సరాల పైనే వయస్సున్న పుస్తకాలు కలిగిన యువ గ్రంధాలయమిది. తెలుగు, సంస్కృత్, అరబిక్ ఇంకా పర్షియన్ భాషలలో ఎన్నో అమూల్యమైన పుస్తకాలున్నవిక్కడ.
Illustrated_Ramayana_in_Persian_language [11]
అక్కడి ఉద్యోగస్తులు మాకు పర్షియన్ బాషలో ఉన్న సచిత్ర రామాయణాన్ని చూపారు. ఎప్పటివో తాళపత్ర గ్రంధాలు, లిఖిత పుస్తకాలు చూశాము. తాళపత్రాలను ఎలా lamination చేస్తారో చూపారు. మరో section లో అరబిక్, పర్షియన్ గ్రంధాలను photos తీసి వాటిని అధ్యనయం చేసి సంక్షిప్త catalogues తయారు చేస్తున్నారు. ఈ పని ఇరాన్ దేశపు సహకారాలతో చేస్తున్నారు. వివిధ భాషల తాళపత్రాల, లిఖిత గ్రంధాల వివరాలతో కూడిన పట్టిక display లో పెట్టారు.
A book of songs and poems by unknown author [12]
వీటిని శోధించి, పరిష్కరించి కొన్ని పుస్తకాలను ఈ సంస్థ ముద్రింప చేసింది. ఇవి అమ్మకానికి ఉన్నాయి. వారు వెలువరించిన పుస్తకాలు అన్నీ display లో పెట్టారు. అక్కడ లభ్యమయ్యే పుస్తకాల సంక్షిప్త వివరణలతో కూడిన catalogues ప్రచురింపచేశారు. ఇంకా చాలా పుస్తకల పూర్తి text ను పుస్తకాలుగా ఆవిష్కరింపచేయాల్సిన పని ఉంది. దీనికి ఆయా బాషల పండితులు అవసరం. వారు కావలసినంత లేనందున అరబిక్, పర్షియన్ పుస్తకాల పరిష్కరణ నెమ్మదిగా జరుగుతుంది. ఎన్నో అరుదైన గ్రంధాలు ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకు శ్రీనాధుని ఖండ కావ్యాలు. పేరులేని రచయితల గ్రంధాల, రచయితల పేర్లు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మన సభ్యులు కొందరు వారికి నచ్చిన పుస్తకాలకై order చేశారు.
పుస్తకాల delivery లో కొంత జాప్యం ఉన్నందున, lunch time కావటం తో అందరం తార్నాకా సుప్రభాత్ హోటల్ కి లంచ్ కి వెళ్ళాము. అక్కడ A.C. Conference Hall లో అనుకోకుండా అందరం కలిసి కూర్చుని ఆలొచన చెయ్యటానికి అవకాశం కలిగింది. Dr.T.L.S. Bhaskar తో ఇక్కడే తీరికగా మాట్లాడే అవకాశం కలిగింది. కూడలి లో ఈ మధ్య కవితలు, పాటలు ఎక్కువయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం స్వీయ రచనలు కావు. ఇవి blogs seriousness తగ్గిస్తాయని సుధాకర్ మరియు నా అభిప్రాయము. వీవెన్ కు చెప్పాను. వీటి కోసం ఒక tab పెట్టాలని. వీవెన్ కొంత convince అయ్యినట్లని పించింది. మీరు కూడా మాలాగే feel అవుతే తెలుగుబ్లాగ్ గుంపుకు ఒక జాబు రాయండి - కూడలిలో కవితలు విడదీయాలని. ఆప్పుడే ఫోన్ వచ్చింది జ్యొతి నుంచి - తను డా.తి.రావు గారి కార్యాలయం వద్ద వున్నానని. Lunch ముగించుకుని బయలు దేరాము. డా.భాస్కర్ Rs.500/- చెల్లించి మన సంఘ సభ్యులయ్యారు.
డా.తిరుమల రావు గారు తమ కార్యాలయంలో వారి అతిథులను పరిచయం చేశారు. వారు జయ్వంత్ నాయుడు - వీరు హవాయీన్ (Hawaiian) గిటార్ పై హిందుస్తానీ సంగీతం వాయిస్తారు. ఇది వారి ప్రవృత్తి. వృత్తి రీత్యా వీరు G.Jaywant Naidu & Co అనే పేరుతో ఒక Chartered Accounts సంస్థను నిర్వహిస్తున్నారు. తార్నాకా లో ఉన్న A.P.State Archieves & Research Institute లో పని చేసి , పదవీ విరమణ చేసిన S.Md.Anwarul Hak గారిని పరిచయం చేశారు.వారు 1937-39 మధ్య నడిచిన ఆంధ్ర కేసరి అనే లిఖిత మాస పత్రిక లోని వ్యాసాలను క్రోడీకరించి ఆంధ్ర కేసరి పుస్తకాన్ని వెలువరించారు. దా.తి.రావు గారు ఈ పుస్తకం ప్రతిని మన మిత్రులు త్రివిక్రం కు అందచేశారు. మరో అతిధి Sri S.Rama Krishna గారు. వీరు A.P.State Archieves & Research Institute లో Asst.Director గా పని చేస్తున్నారు.వీరు మన సభ్యులందరినీ వారి కార్యాలయానికి రావలసినదిగా ఆహ్వానం పలికారు. తెలుగు మిత్రులకు ఉపయోగపడే చాలా సమాచారం ఉంది వీరి దగ్గర.మరొ అతిధి శ్రీ షరీఫ్ గారు. వీరు Fine Arts College లో అధ్యాపకులు. వీరి శిష్యులు గురువును మించిన వారు. పేర్గాంచిన వైకుంఠం, లక్ష్మా గౌడ్ మొదలగు వారు వీరి శిష్యులే. డా.తి.రావు వారి కార్యాలయంలోనే పని చేస్తున్న డా.సుబ్బారావు గారిని పరిచయం చేశారు. వీరు తెలుగు,హిందీ మరియు ఆంగ్ల భాషా ప్రావీణ్యులు.
మన సభ్యులు సందర్సించిన Oriental Library మిగతా ఛాయా చిత్రాలు Upload చేశాను. వాటిని ఇక్కడ చూడండి. Visit May 07 Oriental Library [13] Description కొరకు slide show కాకుండా individual photos పై click చెయ్యండి.
డా.తిరుమల రావు స్వయంగా మంచి రచయిత, కవి. పలు పత్రికా సంపాదకులు వీరి మిత్రులు. వారిని తెలుగు లో బ్లాగు ప్రారంభించమన్న నా అభ్యర్ధనకు స్పందించి తమ అంగీకారం తెలిపారు. సంస్కృతి -విస్మృత కోణం అనే పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. ఈ పేరు డా.తి.రావు గారు సూచించినదే. వ్యాసాల typing, blog maintenance చెయ్యటానికి మన జ్యొతక్క ముందు కొచ్చారు. అంతే కాదు ఆ సాయంకాల సమావేశానికి మన మిత్రులందరి కోసం కేకులు,అరటి పళ్ళు, శీతల పానీయాలు తెచ్చారు. గతం లో హోసూర్ లో జరిపినట్లుగా , ఈ సారి నాందేడ్ లో తెలుగు కళారూపాలపై సదస్సు ఏర్పాటు చేస్తున్నామని డా.తి.రావు గారు తెలిపారు. ఇది వచ్చే నెలలో ఉండవచ్చు. ఆసక్తి కలవారు ఈ సదస్సు హాజరు కావచ్చు. అత్త, మామ అనే పదాలు మరాఠీ భాష నుంచి మనం తీసుకున్నామని డా.తి.రావు గారు చెప్పారు.
e-telugu.org వారు చేస్తున్న పనుల తీరు తెన్నులిక్కడ చూడండి.[14] మరియు [15]
మీ ప్రశ్నలు, సందేహాలు ఇక్కడకు పంపండి.telugublog@googlegroups.com ఈ సమావేశం లో అనుకున్నట్లుగా వీవెన్ ఒక చక్కటి టపా రాశారు తెలుగులో బ్లాగ్ పై. చూడండి. [16]
పోయిన నెల[17] లో బెంగళూరు లో అవ్వని సమావేశ వెశేషాలు రాశాను.మన బెంగళూరు మిత్రులు నుంచి response రాలేదెందుకనో! అయ్యా, మీరు నెలకోసారి కలుసుకునే ప్రయత్నం మొదలెట్టండి. అమెరికా మిత్రులారా మీ తెలుగు సంఘం స్థాపించే పనులు మొదలు పెట్టండి. మీకు ఇబ్బందులులేమన్నా ఉంటే మాకు రాయండి.
బ్లాగ్మిత్రులు ఉత్సాహంగా బ్లాగులు రాస్తున్నారు. కాని వీటి గురించి పత్రికలలో, టి.వి. లో ప్రచారం జరిగినప్పుడే, ఎక్కువమంది తెలుగు వారికి వీటి గురించి తెలుస్తుంది. మన మిత్రులు ఈ విషయం పై దృష్టిని సారించవలసిన అవసరం కనిపిస్తుంది.
