2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

సాధన

ఈ-తెలుగు నుండి

నా పేరు సాగర్. నా గురించి చెప్పాలంటే చాల ఉంది జీవితం అనే సాగరంలో కష్ట సుకాల మదనమే నేను సల్ట్, స్వీట్ రెండు నాకు ఇష్టమే. నవ్వేవాళ్ళకంటే ఏడ్చే వాళ్ళంటే ఇష్టం. సరధాగా గడిచి పోతున్న కాలంలో మరుతున్న ఋతువుల్లా నిత్యనూతన వొరవడిలో కొంగొత్త ఆలోచనలతో ముందుకు పోవడం నాకు ఇష్టం కష్ట సుకాలకు నేను అతీతం ప్రేమ, ద్వేశం, అనురాగాలు, బాదలు, బయాలు, కలల్లో కసి, కడుపులో ఆకలి, కదలికలో దూసుకు పోయోతత్వం నానైజం. బదిలో చదివిన పాఠాల కంటే జీవితం నాకు నేర్పిన పాఠాలు ఎక్కువ. ప్రతి అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు జీవితంలో ఎంతోమందికి ఎదిగేందుకు సలహాలుగా ఉపయోగపడతాయి. నాదగ్గరకు వచ్చే సమస్యలలో ఎక్కువ శాతం బార్య బర్తల మద్య మనస్పర్దలు ప్రేమ, ప్రేమ కోసం యువతి యువకుల తపన, జీవితంలో ఎలా పైకి రావాలి ఎలా ఎదగాలి తదితర మానసిక వ్యక్తిగత సమస్యల పరిస్కారం కోసం ఎందరో నన్ను సంప్రదిస్తుంటారు. అలాగే మీకు ఏవైన సమస్యలున్నా నన్ను సంప్రదిస్తే స్నేహపూర్వకంగా పరిష్కారలందించేందుకు కృషి చేయగలను.


                                                                         సాగర్.
"http://wiki.etelugu.org/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A7%E0%B0%A8" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు