2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
బహువచన రూపాలు
ఈ-తెలుగు నుండి
సాధారణంగా, ఒక పదం యొక్క ఏకవచన రూపానికి లు ని చేర్చడం ద్వారా బహువచనమేర్పడుతుంది. కానీ ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ పేజీలో పొందుపరచండి.
గమనిక: ఇక్కడ పదాలసంఖ్యకన్నా నియమాలకి ప్రాథాన్యత నివ్వండి. ప్రతీ నియమానికి మూడు నాలుగు ఉదాహరణలు చాలు.
విషయ సూచిక |
సాధారణ నియమం: లు చేరుతుంది
- నియమం: పదం చివరన లు చేరుతుంది.
- కలువ - కలువలు
- కలము - కలములు
సున్నాతో అంతమగు పదాలు
- నియమం: సున్నా పోయి చివరి అక్షరానికి దీర్ఘం వస్తుంది. లు కలుస్తుంది.
- కలం - కలాలు
- కాలం - కాలాలు
- మరిన్ని పదాలు
- నియమం: సున్నా పోయి చివరి అక్షరానికి ఏత్వం వస్తుంది. లు కలుస్తుంది.
- పందెం - పందేలు
- నాణెం - నాణేలు
- మరిన్ని పదాలు
న్ను తో అంతమగు పదాలు
- నియమం: చివరి అక్షరం పోయి, ళ్ళు చేరుతుంది.
- కన్ను - కళ్ళు
- పన్ను - పళ్ళు
ఇత్వం తో అంతమగు పదాలు
- నియమం: చివరి అక్షరానికి ఇత్వం పోయి ఉత్వం వస్తుంది. లు కలుస్తుంది.
- కవి - కవులు
- గది - గదులు
- మరిన్ని పదాలు
డు/డి తో అంతమగు పదాలు
- నియమం: డు తొలగి ళ్ళు చేరుతుంది
- దేవుడు - దేవుళ్ళు
- నియమం: డి తొలగి ళ్ళు చేరుతుంది
- గుడి - గుళ్ళు
- బడి - బళ్లు
రు తో అంతమగు పదాలు
- నియమం: చివరి అక్షరానికి ల వత్తు వస్తుంది.
- పేరు - పేర్లు
- ఊరు - ఊర్లు
ను తో అంతమగు పదాలు
- నియమం: చివరిఅక్షరం పోయి లు చేరుగుంది.
- పేను - పేలు
- చేను - చేలు
యి తో అంతమగు పదాలు
- నియమం: చివరిఅక్షరం పోయి ళ్ళు చేరుతుంది.
- రాయి - రాళ్ళు
- నియమం: చివరి అక్షరం పోయు తులు చేరుతుంది.
- చేయి - చేతులు
ట్టు తో అంతమగు పదాలు
- నియమం: ట వత్తు పోయి ల వత్తు చేరుతుంది.
- జట్టు - జట్లు
- మెట్టు - మెట్లు
- గట్టు - గట్లు
- చెట్టు - చెట్లు
ద్దు తో అంతమగు పదాలు
- నియమం: చివరి అక్షరం పోయి డ్లు చేరుతుంది.
- ఎద్దు - ఎడ్లు
