2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
చర్చ:Start a Blog
ఈ-తెలుగు నుండి
నా తెలుగు జాతి ప్రజలార! దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు.తెలుగు భాషలో వున్న తీయదనం ఏ భాషలో కూద దొరకదు.ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీజాతి నిండు గౌరవం అన్న శ్రీ గురజాద గారి మాటలను నెమరవేసుకోండి. పరభాషలను గౌరవిస్తూ మన భాషను అదికంగ గౌరవించండి.మన తెలుగు భాష ఔనిత్యాన్ని కాపాడండి.నలుదిశలకు వ్యాపింప చేయండి.లేని పోని భెషిజాలకు పోకుండా మన తెలుగు వారు ఎక్కద కనిపించినా వారితో తెలుగులోనే మాట్లాడండి.చూసిన వారు ఎవ్వరైనా మనల్ని మెచ్చుకోకుండా వుండరు.పరదేశంలో వుండి కూడా ఎందరో మన భారతీయులు తెలుగు భాషకు విషిష్ట కృషిచేస్తున్నారు.తెలుగులో కదలు వ్రాయడం, కవితలు వ్రాయడం,వ్యాసాలువ్రాయడం లాంటి అబిరుచులను పెంపొందించుకోవాలి.పవిత్ర పర్వ దినాల్లో తెలుగులో శుభాకాంక్షలు చెప్పుకోవడం, వ్రాసుకోవడం చేయండి.ఇంగ్లిష్ మీదియం లొ చదవడం తప్పుకాదు కాని తెలుగుని విస్మరించడం తగదు. తెలుగు వారైవుండి ఎంతో స్తైల్ గా నాకు తెలుగు చదవడం,వ్రాయడం రాదు నాది ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు తోటి తెలుగువారి మన్సులు చివుక్కుమనక మానవు.త్వరలో మన తెలుగు భాషను శాశ్త్రీయ భాషగ గుర్తించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.మనకున్న చదువు విజ్ఞానం,వివేకంతో మన తెలుగు భాషను బ్రతికించుకుందాము. జై తెలుగునాడు, జై తెలుగు తల్లి. నా ఈ మనోభిలాషను ఆశీర్వదించి తెలుగు భాషకు మీ వంతు కృషి చేస్తారని ఆశిశ్తూ....................మీ అక్కునూరి
