2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.
చర్చ:యూనికోడ్
ఈ-తెలుగు నుండి
- ప్రతి ఒక్క వెబ్ సైటుకీ నాణ్యత కలిగిన సమాచారం అందించడం ఎంత ముఖ్యమో..పాఠకుల అభిప్రాయాలు సేకరించడం కూడా అంతే ముఖ్యం. ఒక వేళ పాఠకుడు తన అభిప్రాయాన్ని తెలుగులోనే విన్నవించికోదలుచుకొంటే...అది యూనీకోడులోనే సాధ్యం.
ఇదుంలో నిజం తక్కువ. తెలుగుపీపుల్ డాట్ కాం లాంటి సైట్లు యూనికోడు లేకుండా అభిప్రాయ వేదికలు చాలా కాలంగా నడుపుతున్నాయి. (అందులో చాలామటుకు పోచికోలు కబుర్లు తప్ప, పనికొచ్చే సమాచారం చాలా తక్కువనుకోండి.) WYSIWYG పద్ధతిలో అభిప్రాయ సేకరణ యూనికోడు తోనే సాధ్యం.
ఇంక, యూనికోడుకి పెద్ద విజయం-- ఎక్కువ ప్రజాదరణ పొందిన సైట్లు, ముఖ్యంగ, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటివి యూనికోడుకి మారడం. ముఖ్యమైన సైట్ల వాళ్లని యూనికోడు వైపు ఎలా తిప్పగలమో మనందరం సీరియస్ గా ఆలోచించాలి. వీLlu మారేదాకా, మనం ఎంత పెద్ద కేకలు వేసినా, కరపత్రాలు పంచినా ఎక్కువ ప్రయోజనం లేదు. (కరపత్రాల వల్ల ప్రయోజనం లేదని కాదు, కరపత్రాల ప్రచారం వల్ల సాధారణ ప్రజలు/యూజర్లు తమ కంప్యూటర్లని upgrade చేసుకుంటారు) ఎక్కువ ప్రజాదరణ పొందిన సైట్లని మార్చడానికి ప్రయత్నించడం, -- అవసరమైతే, చేయిపట్టుకుని (ఉచితంగా!) సాంకేతిక సహాయం చేసైనా సరే --అన్నది eతెలుగు లక్ష్యాల్లో ఒకటి కావాలని నా చిరకాల అభిలాష. --పద్మ ఇం.
