2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

ఈ-తెలుగు సంఘ నిర్మాణం

ఈ-తెలుగు నుండి

ఈ-తెలుగు సంఘం ఎలా ఏర్పడిందనే విషయం గురించి ఈ వ్యాసం తెలియజేస్తుంది.

తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు నెలకోసారి హైదరాబాదులో కలిసే సాంప్రదాయాన్ని నెలకొల్పుకున్నారు. 2006 మార్చి 12 న మొదలైన ఈ సమావేశాలు క్రమం తప్పకుండా ప్రతి నెలా జరుగుతూ వచ్చాయి. నెట్లో తెలుగు వ్యాప్తి గురించి, బ్లాగుల వ్యాప్తి గురించి, వికీపీడియా విస్తృతి గురించి ఈ సమావేశాల్లో చర్చించేవారు. ఈ చర్చల్లో వచ్చిన ఆలోచనే ఈ-తెలుగు సంఘం. కంప్యూటరుకు తెలుగు నేర్పడం, బ్లాగులు, వికీపీడియా గురించిన అనేక విశేషాలతో 2006 డిసెంబరులో ఒక పుస్తకాన్ని ప్రచురించి ఉచితంగా పంపిణీ చేసారు కూడాను. ఇటువంటి ఉమ్మడి పనులు ఓ సంఘపు గొడుగు నీడన చెయ్యడంలో ఉండే వీలును గమనించిన సభ్యులు సంఘ నిర్మాణంపై ఆలోచనలు చేసారు. ఆ ఆలోచనల ఫలితమే - ఈ-తెలుగు సంఘం.

తొలి చర్చలు

ఇవి కూడా చూడండి

పేజీకి సంభందించిన లింకులు