2008-03-01: గమనిక: అనామక మార్పుచేర్పులను నిషేధించాం. మార్పులు చెయ్యడానికి లోనికి ప్రవేశించాలి.

ఈ-తెలుగు:గురించి

ఈ-తెలుగు నుండి

e-తెలుగు అన్నది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగుని వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే సంస్థ. ఇది లాభాపేక్షలేని సంస్థగా నమోదయింది.

విషయ సూచిక

స్వప్నం/లక్ష్యం

ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను) మరియు అంతర్జాలాన్ని వాడుకోగలగడం. వాడుకోగలగాలి. అదే మా స్వప్నం. ఆ దిశగా మేము కృషిచేస్తున్నాం.

అంచెలు/దశలు

పై స్వప్నం ఈ క్రింది అంచెలలో సాకారమవుతుందని అనుకుంటున్నాం:

  1. పరిచయం: కంప్యూటర్లలో తెలుగుని చూడవచ్చు మరియు రాయవచ్చని ప్రజలు తెలుసుకోవడం.
  2. ఆదరణ: అంతర్జాల అనుసంధానమున్న సామన్య ప్రజలందరూ తమ ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులోనే జరుపుకోవడం.
  3. వ్యాప్తి: సాధారణంగా ఉపయోగించే వెబ్ సైట్లు మరియు కంప్యూటర్ ఉపకరణాలు తెలుగులో అందుబాటులోకి రావడం
  4. స్థిరత: రోజువారీ వాడే సాంకేతిక పదాలకు (అందరూ వాడుతుండడం వల్ల) ఓ స్థాయి ప్రామాణికత రావడం
  5. విజృంభణ: సగటు తెలుగు వాడికి అవసరమైన కంప్యూటర్ సంభాషణ అంతా తెలుగులోనే జరుగుతుంది. అన్ని రకాల వెబ్ సైట్లూ, ఉపకరణాలూ తెలుగులోనూ లభిస్తాయి.

కార్యకలాపాలు/దిశలు

పై స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి, వివిధ దిశల్లో ఈ కార్యకలాపాలను e-తెలుగు తలపెట్టింది:

ప్రచారం/అవగాహన

  • అంతిమ వాడుకరులు
    • తెలుగుని కంప్యూటర్లో చూడవచ్చు, రాయవచ్చని, తెలుగులో జాలాన్ని అన్వేషించవచ్చని తెలియజేయడం.
    • రోజువారీ సంభాషణలని తెలుగులో జరుపుకోవడాన్ని ప్రోత్సహించడం.
    • తెలుగులో అందుబాటులో ఉన్న అంతర్జాల సేవలను తెలియజేయడం.
  • ఉపకరణ తయారీదార్లు మరియు వికాసకులు
    • యూనికోడ్ మరియు దానివల్ల ప్రయోజనాలు తెలియజేయడం
  • వ్యాపార సంస్థలు
    • తెలుగులో వారెందుకు వ్యవహారాలు నిర్వహించాలి?

సహాయం

  • అంతిమ వాడుకరులు
    • కంప్యూటర్లో తెలుగు చేతనం చేసేందుకు అవసరమైన సాంకేతిక సహాయం
  • ఉపకరణ తయారీదార్లు / జాల వికాసకులు
    • తెలుగులో ఉపకరణాలు మరియు జాలగూళ్ళు తయారుచేయడానకై తగిన సాంకేతిక సహాయం అందించడం.

స్థానికీకరణ

  • వివిధ ఉపకరణాల తెలుగీకరణకు తోడ్పడడం
  • కొత్త తెలుగు పదాల సృష్టి మరియు క్రోడీకరణ

యూనీకోడీకరణ

  • యూనీకోడ్ లాభాలు తెలియజేయడం
  • సాంప్రదాయ/ప్రైవేటు సంకేతలిపుల నుండి యూనీకోడ్ లోనికి మార్పిడి చేయడంలో సహాయం అందించడం

వికీ/స్వేచ్ఛా విషయాంగం

  • తెలుగు వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టులలో పాల్గొనడం

తెలుగు గూళ్లు, బ్లాగులు

ఖతులు తయారీ

  • యూనికోడ్ తెలుగుకి సరిపడే విధంగా ఖతులను తయారీని ప్రోత్సహించడం

స్పెల్ చెకింగ్

నేపథ్యం

అంతర్జాలంలో తెలుగు కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు వెబ్ సైట్లు సృష్టించారు, కొందరు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నారు, కొందరు తెలుగు బ్లాగులు రాస్తున్నారు. కొందరు కంప్యూటర్ మరియు వెబ్ ఉపకరణాలను తెలుగులోకి అనువదిస్తున్నారు, మరికొందరు ఇతర సమస్యలపై పనిచేస్తున్నారు. వీరందరి ప్రయత్నాలని ఏకీకృతం చేయడానికై ఉద్దేశించినదే e-తెలుగు.